: ట్యాంకర్ నుంచి కారుతున్న నూనెను దక్కించుకోవడానికి పోటీపడిన ప్రజలు
బీహార్‌లోని ఓ ప్రాంతంలో రహదారిపై ఆవాల నూనెతో వెళుతోన్న ఓ ట్యాంకర్‌కు ఒక్కసారిగా చిల్లు పడింది. దీంతో రోడ్డుపై నూనె ప్రవహించింది. రోడ్డు మొత్తం నూనెతో నిండిపోయింది. దీనిని గమనించిన అక్కడి స్థానికులు వందలాదిగా అక్కడికి చేరుకున్నారు. ట్యాంకు నుంచి కారుతున్న నూనెను దక్కించుకోవడానికి పోటీపడ్డారు. డ్రమ్ములు, బిందెలు, బకెట్లు పట్టుకొని అక్కడికి వచ్చి వాటిల్లో నూనెను నింపుకొని పోయారు. రోడ్డుపై చిన్నపాటి గుంతల్లో పడిన నూనెను కూడా తీసుకోవడానికి పోటీపడ్డారు. రోడ్డుపై ప్రవహిస్తోన్న నూనెను బకెట్లలో నింపుకోవడానికి నానా ప్రయత్నాలు చేశారు.