: భారత్‌కు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నా: విజయ్ మాల్యా
బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి గుట్టు చప్పుడు కాకుండా భారత్ నుంచి విదేశాలకు వెళ్లిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా తాజాగా ఢిల్లీ పటియాలా కోర్టులో తాను ఇండియాకు రాకపోవడానికి ఉద్దేశాన్ని తెలిపాడు. తాను భారత్‌కు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నానని అన్నాడు. అయితే రాలేకపోతున్నానని చెప్పాడు. దానికి కారణం తన పాస్ పోర్టును రద్దు చేయడమేనని పేర్కొన్నాడు. తన పాస్ పోర్టును రద్దు చేయడం సరికాదని మాల్యా కోర్టుకు తెలిపాడు. మాల్యా విదేశాలకు చెక్కేయడంతో తన పాస్ పోర్టును ఈ ఏడాది మార్చిలో ఇండియా రద్దు చేసిన విషయం తెలిసిందే.