: ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొన్న కేజ్రీవాల్ ఇన్నోవా.. తృటిలో తప్పిన ప్రాణాపాయం


నాలుగు రోజుల పర్యటన నిమిత్తం పంజాబ్ లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా (సీహెచ్ 01 ఏబీ 9595) కారు, కాన్వాయ్ లోని ఎస్కార్ట్ జీప్ ను ఢీకొట్టింది. జలంధర్ నుంచి అమృతసర్ మార్గంలోని పీఏపీ చౌక్ సమీపంలో ఈ ప్రమాదం జరుగగా, ఇన్నోవా హెడ్ లైట్, బాయ్ నెట్, బంపర్ దెబ్బతిన్నాయి. ఆ సమయంలో కేజ్రీవాల్ ముందు సీట్లోనే కూర్చుని ఉన్నారని, ప్రమాదంలో కేజ్రీవాల్ కు ఎలాంటి గాయాలూ కాలేదని ఆప్ వర్గాలు తెలిపాయి. ఇదే ఇన్నోవాలో వెనుక సీట్లో భగవంత్ మన్, గురుప్రీత్ గుగ్గిలు కూడా కూర్చున్నారని, ఘటన అనంతరం వారు మరో వాహనంలో వెళ్లిపోయారని వివరించారు.

  • Loading...

More Telugu News