: ముంబై నేవీ రిక్రూట్‌మెంట్‌లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు


ముంబైలోని మలాద్‌లో కొద్దిసేపటి క్రితం నిర్వహించిన నేవీ రిక్రూట్‌మెంట్‌లో జరిగిన తొక్కిసలాటలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రిక్రూట్‌మెంట్‌కు 4వేల మంది హాజరుకావచ్చని భావించగా అంచనాలకు మించి 6వేల మందికి పైగా హాజరయ్యారు. గేట్ ద్వారా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనలో ఇద్దరికి మాత్రమే గాయాలయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నట్టు నేవీ పేర్కొనగా; తోపులాటలో చాలామంది గాయపడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రిక్రూట్‌మెంట్‌కు అనూహ్య స్పందన వచ్చినట్టు నేవీ తెలిపింది. తొక్కిసలాటను స్థానిక పోలీసులు సమర్థంగా అదుపులోకి తీసుకొచ్చినట్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News