: నిరసన మా హక్కు!... అంతమాత్రానికే మార్షల్స్ చేత కొట్టిస్తారా?: చెవిరెడ్డి ఆవేదన
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై అసెంబ్లీలో నిన్న మొదలైన రగడ నేటి ఉదయం మరింత ముదిరింది. సభలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన వైసీపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే, మార్షల్స్ మద్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో సభలో గందరగోళం నెలకొనగా స్పీకర్ కోడెల శివప్రసాద్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ నుంచి బయటకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వచ్చి లోపల జరిగిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంగా నిరసన తెలిపే హక్కు తమకుందని ఆయన పేర్కొన్నారు. తమకు సంక్రమించిన హక్కు మేరకే నిరసన తెలిపితే... మార్షల్స్ తో కొట్టిస్తారా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.