: టెక్సాస్ హైస్కూల్లో కాల్పులు.. ఒకరి మృతి
అమెరికాలో కాల్పుల ఘటనలకు తెరపడడం లేదు. ఎక్కడో ఓ చోట కాల్పుల కలకలం రేగుతూనే ఉంది. తాజాగా గురువారం రాత్రి పశ్చిమ టెక్సాస్ పట్టణమైన అల్పైన్‌లోని ఓ హైస్కూల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనతో అల్పైన్ హైస్కూలుతోపాటు ఇతర స్కూళ్లను కూడా అధికారులు మూసివేశారు. అల్పైన్ స్కూలుకు చెందిన వ్యక్తే కాల్పులకు తెగబడినట్టు బ్రెవస్టర్ కౌంటీ షరీఫ్ కార్యాలయం పేర్కొంది. తమకు రెండుమూడు సార్లు తుపాకి కాల్పులు వినిపించినట్టు విద్యార్థులు తెలిపారు.