: ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో భారీ లడ్డూ బదులు బుల్లి లడ్డూ!


ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో భారీ లడ్డూకు బదులుగా 11 కిలోల చిన్న లడ్డూను ఉంచారు. వినాయకచవితి రోజు నుంచి నిన్నటి వరకు ఒట్టి చేత్తోనే ఉన్న గణపతి చేతిలో, ఖైరతాబాద్ కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ఈ చిన్న లడ్డూను ప్రత్యేకంగా తయారు చేయించి పెట్టారు. వాస్తవానికి ఖైరతాబాద్ వినాయకుడి కోసం తాపేశ్వరానికి చెందిన మల్లిబాబు ఈసారి 500 కిలోల ప్రత్యేక లడ్డూను తయారు చేయించారు. అయితే ఈ విషయం ఉత్సవ కమిటీలోని ముగ్గురు సభ్యులకు తప్ప, మిగతా వారికి తెలియదట. దీంతో లడ్డూ విషయంలో చవితి రోజునే అక్కడ వివాదం తలెత్తింది. దాంతో, ఆ లడ్డూ స్వామి వారి చేతిలోకి వెళ్లలేదు. కేవలం నైవేద్యంగా మాత్రమే దీనిని సమర్పించారు. మరోపక్క, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు మహేష్ యాదవ్, మరోదాత 51 కిలోల లడ్డూను తయారు చేయించినప్పటికీ అది కూడా గణేశుడి చేతిలోకి చేరలేకపోయింది. చివరకు, శ్రీధర్ తయారుచేయించిన 11 కిలోల లడ్డూను మాత్రం వినాయకుడి చేతిలో ఉంచారు.

  • Loading...

More Telugu News