: మరో విజయం.. జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌05 రాకెట్‌ ప్రయోగం సక్సెస్.. అభినందనలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని సాధించింది. జియోసింక్రనస్‌ లాంచ్‌ వెహికిల్‌ (జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌05) రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంతో అందులో పాల్గొన్న శాస్త్ర‌వేత్త‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌యోగాన్ని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి నిర్వహించారు. 2,211కిలోలు బ‌రువుగ‌ల‌ ఇన్సాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాన్ని 17 నిమిషాల్లోనే కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉప‌గ్రహాన్ని వాతావరణ అధ్యయనానికి ఉప‌యోగించ‌నున్నారు. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉప‌గ్ర‌హాన్ని రూపొందించారు. ఇస్రో ప్ర‌వేశ‌పెట్టిన ఈ ఉపగ్రహం సముద్ర గాలి దిశలను గమనించి కచ్చితత్వంతో పరిశోధనను కొన‌సాగిస్తుంది. అందులో ఇమేజింగ్‌ వ్యవస్థతో పాటు వాతావరణంలోని శబ్ద తరంగాలను అన్వేషించే వ్యవస్థ ఉంది. ఈ ఉప‌గ్ర‌హం పదేళ్ల‌పాటు సేవ‌లందించ‌నుంది. జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌05 ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ సత్తాను ఇస్రో శాస్త్రవేత్తలు మరోసారి ప్రపంచానికి చాటారని అన్నారు.

  • Loading...

More Telugu News