: కాశ్మీర్ అధికార పార్టీ పీడీపీలో చీలిక తలెత్తే ప్రమాదం!


కాశ్మీర్లోని అధికార పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (పీడీపీ)లో విభేదాలు తలెత్తే ప్రమాదం ఉన్నట్లుగా తెలుస్తోంది. పీడీపీ-బీజేపీల భావజాలం పరస్పర విరుద్ధమని, సంకీర్ణం నుంచి బయటకు రావాలంటూ ఆ పార్టీ సీనియర్ నేత ముజఫర్ బేగ్ డిమాండ్ చేశారు. కాశ్మీర్ లో ఉద్రిక్తతను చల్లార్చలేని సీఎం మెహబూబా ముఫ్తీ తన పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ముజఫర్ బేగ్ వ్యాఖ్యల కారణంగా పీడీపీలో చీలిక తలెత్తే ప్రమాదం ఉన్నట్లు వస్తున వార్తలపై ఆ పార్టీ స్పందించింది. అటువంటిదేమీ లేదని పీడీపీ ప్రకటించింది.

  • Loading...

More Telugu News