: తిరిగొచ్చిన ఎఫ్ఐఐలు... లాభాల్లో మార్కెట్లు!


సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరువైన వేళ, బుధవారం నాడు లాభాలు స్వీకరించిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు దేశవాళీ ఫండ్ సంస్థలు ఈక్విటీల కొనుగోళ్లకు యత్నించిన వేళ, బెంచ్ మార్క్ సూచికలు లాభాల్లోకి నడిచాయి. సెషన్ ఆరంభంలో నష్టాల్లో ఉన్న సెన్సెక్స్, నిఫ్టీలు క్రమంగా లాభాలవైపు దూసుకెళ్లాయి. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 118.92 పాయింట్లు పెరిగి 0.41 శాతం లాభంతో 29,045.28 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 34.55 పాయింట్లు పెరిగి 0.39 శాతం లాభంతో 8,952.50 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.15 శాతం, స్మాల్ కాప్ 0.83 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 37 కంపెనీలు లాభపడ్డాయి. సన్ ఫార్మా, అరవిందో ఫార్మా, బజాజ్ ఆటో, టాటా స్టీల్, గ్రాసిమ్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, యస్ బ్యాంక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, బీహెచ్ఈఎల్, హెచ్సీఎల్ టెక్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,953 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,609 కంపెనీలు లాభాలను, 1,148 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,12,86,865 కోట్లుగా నమోదైంది.

  • Loading...

More Telugu News