: పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కెళ్లిన కశ్మీరు ఉగ్రవాదులు?
పోలీసుల నుంచి గుర్తు తెలియని దుండగులు ఆరు ఆయుధాలను చోరీ చేసిన ఘటన జమ్ముకశ్మీరులోని కుల్గాం జిల్లా, దమ్హల్ హంజీపోరలో చోటు చేసుకుంది. ఈ పని ఉగ్రవాదులే చేసుంటారని భావిస్తున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఏఆర్ ఖండేకు భద్రత కల్పిస్తున్న సమయంలో నిన్నరాత్రి వారి నుంచి దుండగులు రెండు ఇన్సాస్ తుపాకులు, ఒక ఎస్ఎల్ఆర్, రెండు ఏకే 47లు, ఒక 303 పిస్టల్ ను కాజేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కసారిగా ప్రవేశించిన ఉగ్రవాదులు పోలీసుల వద్ద ఉన్న ఈ ఆయుధాలను లాక్కొని వెంటనే అక్కడి నుంచి పరారయినట్లు సమాచారం. ఘటనపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా భద్రతా సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.