: రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న ప్రకటనకు కట్టుబడి ఉన్నా: టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్
విశాఖ రైల్వోజోన్ ప్రకటించాలనే డిమాండ్ తో అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతీ శ్రీనివాస్ గురువారం విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం దగ్గర పార్టీ కార్యకర్తలతో కలసి దీక్ష చేపట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని దశల వారీగా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రెండున్నరేళ్లు అయినా కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ప్రకటించకపోవడంతోనే రోడ్డుపైకి రావాల్సి వచ్చిందన్నారు. విశాఖ రైల్వే జోన్ ఇవ్వకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న తన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.