: ప్రత్యేక ప్యాకేజ్ కాపీలో పదాలపై చంద్రబాబు అభ్యంతరం?


ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ పై కేంద్రం సిద్ధం చేసిన ప్రకటనలోని పదాలపై సీఎం చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏడు పేజీల ప్రకటన కాపీని చంద్రబాబుకు కేంద్రం పంపింది. ఈ లేఖలో పొందుపరిచిన కొన్ని పదాలపై బాబు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. విభజన చట్టంలో మాదిరి ‘షల్ బీ’, ‘విల్ బీ’,‘ ఎగ్జామిన్’ అనే పదాలను ఇందులో కూడా చేర్చడాన్ని బాబు తప్పుబట్టినట్లు తెలుస్తోంది. ఈ పదాలను తొలగించి ప్రకటనలో స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారని సమాచారం. దీంతో, ఆ ప్రకటన కాపీని కేంద్రం సరిదిద్ది ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) కు పంపింది. సరిదిద్దిన కాపీని మరోసారి చంద్రబాబుకు కేంద్రమంత్రులు పంపారని సమాచారం.

  • Loading...

More Telugu News