: తనను కాపాడాలని అఖిలేష్ యాదవ్ తో మొరపెట్టుకుంటున్న సాహస బాలిక
నాజియా... యూపీ పరిధిలోని ఆగ్రా సమీపంలో ఉండే ఈ పదిహేనేళ్ల బాలిక కిడ్నాపర్ల బారి నుంచి మరో బాలికను కాపాడి రాణి లక్ష్మీబాయి శౌర్య అవార్డు పొందిన సాహసవంతురాలు. ఇప్పుడు మట్కా జూదరులు తనను వేధిస్తున్నారని, వారిని అడ్డుకునే శక్తి తనకు లేదని చెబుతూ, తనను కాపాడాలని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో మొరపెట్టుకుంది. తన ఇంటి ముందు సాగిస్తున్న జూదాన్ని అడ్డుకోవాలని చూసినందుకు తనపై కోపం పెంచుకుని పోలీసులతో కుమ్మక్కై వేధిస్తున్నారని చెప్పింది. తన ఇంటికి వచ్చి అగౌరవంగా ప్రవర్తించారని చెప్పింది. ఈ మేరకు అఖిలేష్ ట్విట్టర్ ఖాతాలో నాజియా ఫిర్యాదు చేయగా, వెంటనే ఆయన కదిలారు. మట్కా జూదగాళ్ల ఆట కట్టించాలని ఆ ప్రాంత ఎస్పీ సుశీల్ ధులేకు ఆదేశాలు ఇవ్వడంతో, పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు జూదగాళ్లను అదుపులోకి తీసుకుని వాళ్ల ఆట కట్టించారు.