: ‘పోకెమాన్ గో’ ఆడుతుంటే ప్రార్థనాలయాల్లో గుడ్లు కనిపిస్తున్నాయంటూ కేసు!
మొబైల్ గేమ్ పోకెమాన్ గో ఆడుతూ ఎంతో మంది ప్రమాదాల బారిన పడుతోన్న సంగతి తెలిసిందే. అయితే, గుజరాత్‌కి చెందిన అనిల్ దవే అనే వ్యక్తి మాత్రం మరో అంశాన్ని పేర్కొంటూ కోర్టుకెక్కాడు. ఆ గేమ్ ఆడే సమయంలో పవిత్రమైన ఆలయాల వద్ద ఫోన్లో పోకెమాన్ ఎగ్స్ కనిపిస్తున్నాయని ఆయన గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గుడ్లు మాంసాహారంగా భావిస్తాం కాబట్టి గేమ్ ఆడే సమయంలో అవి దేవాలయాల్లో ఉన్నట్లు కనిపిస్తుంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఆయన పేర్కొన్నారు. ఇండియాలో పోకెమాన్ గో పై నిషేధం విధించాలని కోరారు. ప్రార్థనాలయాల్లో ఇలా ఎగ్స్ కనిపించడం అపచారమని ఆయన పేర్కొన్నారు. అనిల్ దవే వేసిన పిటిషన్‌ను కోర్టు రేపు విచారించనుంది.