: అసెంబ్లీకి వెళ్లి తీరుతా!... కోర్టు అనుమతి ఇచ్చిందన్న ఆర్కే రోజా!


గడచిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు సహా, టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాపై స్పీకర్ ఏడాది కాలం పాటు సస్పెన్షన్ విధించారు. సస్పెన్షన్ ను ఎత్తివేయించుకునేందుకు రోజా చేసిన ఏ ఒక్క యత్నం కూడా ఫలించలేదు. దీంతో ఇటీవలే ఆమె అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను క్షమాపణలు కోరుతూ లేఖ రాశారు. ఈ క్రమంలో ఆమె అసెంబ్లీకి హాజరవుతారా? లేదా? అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాసేపటి క్రితం వైసీఎల్పీ భేటీ ముగిసిన అనంతరం లోటస్ పాండ్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను అసెంబ్లీకి వెళ్లి తీరతానని ప్రకటించారు. అసెంబ్లీ కార్యాలయం వరకు వెళ్లేందుకు తనకు కోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పిన రోజా... రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి తీరతానని ఆమె స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News