: వేధిస్తున్న యువకుడిని బాధితురాలితో కొట్టించిన మహారాష్ట్ర ఎమ్మెల్యే!


ఓ యువ‌కుడిపై యువ‌తితో ఎమ్మెల్యే దాడి చేయించిన ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని థానెలో చోటు చేసుకుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అహ్ వద్ త‌న ఆఫీసుకి యువ‌కుడిని పిలిపించి యువ‌తితో దాడి చేయించారు. తనను ప్రేమించమని స‌ద‌రు యువకుడి నుంచి త‌న‌కు వేధింపులు వ‌స్తున్నాయ‌ని ఎమ్మెల్యేకు యువతి చెప్పింది. దీంతో యువ‌కుడు మ‌ళ్లీ వేధింపుల జోలికి వెళ్లకుండా చేయ‌డానికి జితేంద్ర స‌ద‌రు యువ‌కుడిని త‌న ఆఫీసుకి పిలిపించుకుని యువతితో దాడి చేయించారు. ఈ ఘ‌ట‌న‌పై జితేంద్ర స్పందిస్తూ... తాను తప్పుచేసినట్టు ప‌త్రికా విలేక‌రులు భావిస్తే త‌న‌ను ఉరి తీయండని అన్నారు. యువ‌కుడు వేధిస్తున్నాడంటూ త‌న‌కు ఫిర్యాదు చేసిన యువ‌తి తన ఇంటికి సమీపంలోని మురికివాడలో నివాస‌ముంటుంద‌ని, వేధింపులు త‌ట్టుకోలేక ఆ యువ‌తి ఆత్మహత్యాయత్నం కూడా చేసిందని ఆయ‌న పేర్కొన్నారు. యువతిని వేధించిన ఆ వ్య‌క్తిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే జితేంద్రపై ఎటువంటి కేసు న‌మోదుకాలేదు.

  • Loading...

More Telugu News