: నేటి నుంచి అమెరికాలో, 26 నుంచి ఇండియాలో ఐఫోన్-7... ధర రూ.63 వేలు!


నేడు అమెరికాలో విడుదల కానున్న ఐఫోన్-7, 26వ తేదీన భారత మార్కెట్లోకి విడుదల కానుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని గ్రహం బిల్ సివిక్ ఆడిటోరియంలో ఐఫోన్ తాజా వర్షన్ ఆవిష్కరణకు ఏర్పాట్లు సిద్ధమైన సంగతి తెలిసిందే. బేస్ మోడల్ లో 32 గిగాబైట్ల అంతర్గత మెమొరీ ఉండగా, దీని ధరను 749 డాలర్లుగా సంస్థ నిర్ణయించింది. ఇక ఇదే ఫోన్ ను ఇండియాలో సొంతం చేసుకోవాలంటే రూ. 63 వేల వరకూ చెల్లించాల్సి వుంటుంది. యాపిల్ ఐఫోన్ అమ్మకాలు ఈ సంవత్సరం జనవరి- ఆగస్టు మధ్య 51 శాతం పెరగడంతో, ఇండియన్ మార్కెట్ పై కన్నేసిన యాపిల్ చీఫ్, సాధ్యమైనంత త్వరలో ఐఫోన్-7ను ఇండియాలో విక్రయించాలని భావిస్తున్నారు. కాగా, ఈ ఫోన్లకు ముందస్తు బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

  • Loading...

More Telugu News