: చంద్రబాబుకు వెంకయ్య ఫోన్!... ఉన్నపళంగా ఢిల్లీ రావాలని ఆహ్వానం!


ఏపీకి స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీ ప్రకటనకు సంబంధించిన విషయంలో కేంద్రం వడివడిగా నిర్ణయాలు తీసుకుంటోంది. నిన్న రాత్రి నుంచే ఈ విషయంలో వేగం పెరగగా... నేటి ఉదయం ఆ వేగం జెట్ స్పీడునందుకుంది. ఈ క్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కార్యాలయం నుంచి విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలోని నారా చంద్రబాబునాయుడికి కొద్దిసేపటి క్రితం ఫోన్ వచ్చింది. ఉన్నపళంగా ఢిల్లీ రావాలని ఈ సందర్భంగా చంద్రబాబును వెంకయ్య కోరారు. చంద్రబాబు సమక్షంలోనే ఏపీకి ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రం యోచిస్తున్న క్రమంలోనే వెంకయ్య ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఒకవేళ ఢిల్లీకి వెళ్లేందుకు చంద్రబాబు మొగ్గుచూపని పక్షంలో విజయవాడలోనే ఏపీకి ప్యాకేజీ ప్రకటించాలన్న దిశగానూ కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News