: వినాయక విగ్రహం ముందు ఎలుక డ్యాన్స్.. చూసేందుకు పోటెత్తిన గుంటూరు వాసులు
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గుంటూరు జిల్లా కాకుమానులోని వీరలకమ్మ ఆలయంలో గణేశుడి విగ్రహం ముందు మగళవారం ఒక ఎలుక నృత్యం చేసింది. ఎలుక డ్యాన్స్‌ను చూసేందుకు గ్రామస్తులు పోటెత్తారు. సోమవారం రాత్రి స్థానికులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ ఎలుక అక్కడికి వచ్చింది. దీంతో భక్తులు దానికి వడపప్పు, పానకం పెట్టారు. దానిని ఆరగించాక ఎలుక ఒక్కసారిగా నృత్యం చేయడం ప్రారంభించింది. ముందరి కాళ్లు ఎత్తి విచిత్రంగా, ఏమాత్రం భయం లేకుండా డ్యాన్స్ చేయసాగింది. అంతేకాదు.. లౌడ్ స్పీకర్‌లో వినిపిస్తున్న పాటలకు అనుగుణంగా శరీరాన్ని, తోకను కదపసాగింది. దీంతో అచ్చెరువొందిన భక్తులు అలా చూస్తూ ఎంజాయ్ చేశారు. విషయం తెలిసిన గ్రామస్తులు ఎలుకను చూసేందుకు క్యూకట్టారు. కొందరు అత్యుత్సాహంతో దానిని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో అది తుర్రుమంటూ విగ్రహం వెనక్కి పారిపోయింది.