: ఫ్లాష్.. ఫ్లాష్: కశ్మీర్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు
కశ్మీరులో తీవ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో ఆర్మీ కాన్వాయ్‌పై దాడిచేశారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత కశ్మీర్‌లో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. కశ్మీర్‌లో శాంతిస్థాపనకు ఓవైపు చర్చల కోసం కేంద్రం ప్రయత్నిస్తుంటే మరో వైపు దానిని అడ్డుకునేందుకు ఉగ్రవాదులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. సైనిక కాన్వాయ్‌పై ఉగ్రదాడికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.