: ఏ ఒక్క కులానికీ దూరంగా ఉండొద్దు!... పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం!
నిన్న హైదరాబాదులోని లోటస్ పాండ్ లో జరిగిన వైసీపీ కీలక భేటీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాజకీయ పార్టీగా ఏ ఒక్క కులానికి కూడా దూరంగా ఉండరాదని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కులానికీ దగ్గరగా ఉండాలని ఆయన సూచించారు. ఏ ఒక్క కులాన్ని విస్మరించరాదని, అన్ని కులాలకు అత్యంత దగ్గరగా మెలగాలని ఆయన కోరారు. కొన్ని కులాలకు మాత్రమే పార్టీ దగ్గరగా ఉంటుందన్న అభిప్రాయాన్ని ప్రజల దరి చేరనీయవద్దని కూడా ఆయన సూచించారు.