: రూ.29కే నెలరోజులపాటు ఇంటర్నెట్.. సరికొత్త ఆఫర్‌ను ప్రకటించిన ఎయిర్‌టెల్
టెలికం కంపెనీల డేటా పోరులో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏ నెట్‌వర్క్ ఎంచుకోవాలో అర్థంకాక తికమకపడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో నాలుగైదు సిమ్‌లుంటే బాగుండును అని అనుకుంటున్నారు. రిలయన్స్ జియో ప్రారంభించిన ఈ పోరులో ఇతర సంస్థలు కూడా జతకలిశాయి. తమ డేటా ప్యాక్ ధరలను విపరీతంగా తగ్గిస్తూ వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. జియో దెబ్బతో దిగొచ్చిన ఇతర ప్రైవేటు రంగ సంస్థలతోపాటు ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా ఆఫర్ల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా దిగ్గజ నెట్‌వర్క్ కంపెనీ ఎయిర్‌టెల్ మరో ఆకర్షణీయ ఆఫర్ ప్రకటించింది. నెలంతా ఇంటర్నెట్ పేరుతో రూ.29 ప్రీపెయిడ్ డేటా ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా వినియోగదారులు 30 రోజుల పాటు 75 ఎంబీ 2జీ, 3జీ, 4జీ డేటాను పొందవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులపాటు ఆన్‌లైన్‌లో ఉండాలనుకునే వారి కోసమే ఈ ప్లాన్ అని ఎయిర్‌టెల్ ప్రకటించింది.