: చెన్నైలో సందడి చేసిన గేల్... బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచన!


తమిళనాడు రాజధాని చెన్నైలో వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ సందడి చేశాడు. వేళమ్మాల్ స్కూల్ లో జరిగిన టీచర్స్ డే వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గేల్ కు విశేషమైన గౌరవం లభించింది. వందలాది మంది విద్యార్థులు గేల్ కు సాదర స్వాగతం పలికారు. గేల్ ను స్కూల్ లోని వేదిక వద్దకు గుర్రపు బగ్గీ మీద తీసుకెళ్లి అతని పట్ల అభిమానాన్ని స్కూలు యాజమాన్యం ప్రదర్శించింది. ఈ సందర్భంగా గేల్ మాట్లాడుతూ, 'టీచర్స్ డే'ను విద్యార్థుల మధ్య నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అన్నాడు. మంచి విద్యనభ్యసిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించగలిగే అవకాశం ఉంటుందని తెలిపాడు. బాగా చదువుకుంటే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని తెలిపాడు. గురువులను గౌరవించడం ద్వారా సంస్కారం పెరుగుతుందని, మంచి సంస్కారం జీవితంలో విలువలను నేర్పుతుందని గేల్ తెలిపాడు. బాగా చదువుకుని అందరూ ఉన్నత స్థానాలకు చేరాలని అభిలషించాడు. అనంతరం విద్యార్థులతో కలిసి బ్రావో 'ఛాంపియన్స్' పాటకు డాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసి, తమిళనాడులో విలువైన అనుభూతులు చవిచూశానని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News