: ప్రియుడితో వెళ్లిపోయేందుకు సొంతింట్లోనే దొంగతనం చేసిన వివాహిత!


న్యూఢిల్లీలోని లాహోరి గేట్ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత మహిళ తమ నివాసంలో దొంగలు ప్రవేశించి నానా బీభత్సం చేశారని, తన దుస్తులు చించి, లైంగికంగా వేధించారని, చివరకు జుత్తు కత్తిరించి ఇంట్లోంచి 10 లక్షల రూపాయలు తీసుకుని వెళ్లిపోయారని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో ఇటీవలి కాలంలో జరుగుతున్న ఈ తరహా ఉదంతాలతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె నివాసానికి చుట్టుపక్కల ఉన్న సీసీ టీవీ పుటేజ్ ను సేకరించారు. ఆమె చెబుతున్న సమయంలో అలాంటి సంఘటన జరిగిన ఆనవాళ్లు లేకపోవడంతో ఆమె చెబుతున్నది నిజమేనా? అన్నది నిర్ధారించుకునేందుకు పోలీసులు తమదైన స్టైల్లో ఆమెను విచారించారు. దీనికి తోడు ఆమె కాల్ డేటాను పరిశీలించారు. దీంతో వాస్తవం వెల్లడించింది. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, భర్తను వదిలేసి అతనితో కలసి వెళ్లిపోయేందుకే 10 లక్షల రూపాయలు దొంగిలించి, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు దొంగతనం నాటకం ఆడిందని వారు నిర్థారించారు.

  • Loading...

More Telugu News