: ఆత్మహత్యల నివారణకు ఫేస్‌బుక్ మరో కొత్త ఫీచర్
ఆత్మహత్యల నివారణకు తోడ్పడేందుకు సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్ మరోసారి ముందుకొచ్చింది. ఈనెల 10న అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మరో కొత్త టూల్ ని యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఆత్మహత్యల నివారణకు ఇప్పటికే ఫేస్‌బుక్ ప్రత్యేక టూల్స్ ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రోజురోజుకీ పెరిగిపోతున్న ఆత్మహత్యలను నివారించడమే లక్ష్యంగా తాజాగా ఛారిటీ సంస్థ సామరిటన్స్ తో ఫేస్‌బుక్ చేయికలిపింది. ఆత్మహత్యల ఆలోచనలతో స్నేహితులు, యూజర్ల ఫ్లాగ్ పోస్టుపై చేసే పోస్టులపై ఆధారపడి పనిచేసే మరో ప్రత్యేక టూల్‌ను తీసుకురానుంది. ఫేస్‌బుక్‌లోని హెల్ప్ ఆప్షన్ బటన్ తో మోడరేటర్లను ఆశ్రయించిన వారిని గుర్తించనుంది. దీంతో అటువంటి ఆలోచనలు ఉన్న వారికి సామరిటన్స్ తో ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తుంది. సామరిటన్స్ వాలంటరీలను యూజర్లు కలుసుకునే విధానాన్ని అందుబాటులో ఉంచనుంది. దీనిపై సంబంధిత అధికారి మాట్లాడుతూ.. యూజర్లు తాము తమ ఫ్రెండ్స్‌కి, కుటుంబసభ్యులకు అందుబాటులో ఉండేలా ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారని, యూజర్లు ఒత్తిడికి గురవుతున్న అంశాన్ని తాము తీసుకొస్తున్న ఈ ప్రత్యేక టూల్ ద్వారా గుర్తిస్తామని పేర్కొన్నారు. యూజర్లను ఒత్తిడి నుంచి దూరం చేయడానికి ఫేస్ బుక్ కృషిచేస్తుందని చెప్పారు. సామరిటన్స్ తో వారిని ఒత్తిడినుంచి దూరం చేసేలా సపోర్టుగా నిలుస్తామని చెప్పారు.