: నేను బతికే ఉన్నాను.. నాపై వస్తోన్న వార్తలన్నీ అవాస్తవాలే: హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్
ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ మరణించాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో సదరు హీరో తాజాగా స్పందిస్తూ తాను బతికే ఉన్నానంటూ చెప్పుకోవాల్సి వచ్చింది. స్టాలోన్ చనిపోయాడంటూ ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ కూడా కథనాలు ప్రసారం చేసింది. దీంతో తన కూతురు సోఫియా స్టాలోన్ తో కలిసి డిన్నర్ చేసిన సందర్భంగా దిగిన ఫొటోను ఆయన షేర్ చేశాడు. తాను చనిపోయానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన పేర్కొన్నాడు. సిల్వెస్టర్ స్టాలోన్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో పలు వదంతులు వ్యాపించాయి. ఆయన మరణానికి కారణం ఆయన వేసుకున్న మందులేనని సోషల్‌మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. మందులకి సంబంధించిన మెడికల్ బిల్ కూడా ఉందని వదంతులు వచ్చాయి. టీవీ ఛానల్‌లోనూ ఆయన చనిపోయినట్లు వార్తలు రావడంతో ఆయన అభిమానులు స్టాలోన్‌కు సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై సిల్వెస్టర్ స్టాలోన్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది.