: 21 శాతం వరకూ తగ్గిన సోనీ స్మార్ట్ ఫోన్ల ధరలు
తామందిస్తున్న హైఎండ్ ఫోన్ల ధరలను 21 శాతం మేరకు తగ్గిస్తున్నట్టు సోనీ ఇండియా ప్రకటించింది. తగ్గించిన ధరలు అమల్లోకి వచ్చాయని చెప్పిన సంస్థ రూ. 48,990గా ఉన్న సోనీ ఎక్స్ పీరియా ధరను రూ. 10 వేలు తగ్గిస్తున్నామని, ఇప్పుడీ ఫోన్ రూ. 38,990కి లభిస్తుందని పేర్కొంది. రూ. 55,990గా ఉన్న ఎక్స్ పీరియా జడ్ 5 ప్రీమియం ఫోన్ రూ. 47,990కే అందిస్తామని వెల్లడించింది. కాగా, ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో 2.75 కోట్ల స్మార్ట్ ఫోన్ యూనిట్లు విదేశాల నుంచి దిగుమతి అయ్యాయి. వీటిల్లో చైనాకు చెందిన లెనోవో, షియోమీ, వివోలదే అత్యధిక వాటా అని ఐడీసీ గణాంకాలు చెబుతున్నాయి. అమ్మకాల పరంగా ఇండియాలో శాంసంగ్ తొలి స్థానంలో ఉండగా, ఆపై మైక్రోమ్యాక్స్, లెనోవో, ఇంటెక్స్ కొనసాగుతున్నాయి.