: కొత్త ఐఫోన్లు వచ్చేస్తున్నాయి!... 7 సిరీస్ లో 256 జీబీ మెమరీని యాడ్ చేసిన యాపిల్!


స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ నుంచి ఐఫోన్ కొత్త సిరీస్ రాబోతోంది. రేపు అమెరికా వేదికగా జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఐఫోన్ 7, 7 ప్లస్ సిరీస్ ఫోన్లు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 10.30 గంటలకు సదరు కార్యక్రమాన్ని మనం కూడా లైవ్ లో వీక్షించవచ్చు. లెక్కకు మిక్కిలి కంపెనీల నుంచి అధునాతన ఫీచర్లతో వస్తున్న స్మార్ట్ ఫోన్లు ఎన్ని ఉన్నా.. . ఐఫోన్ సిరీస్ కు ఉన్న క్రేజే వేరు. కొత్త వెర్షన్ కింద రానున్న ఐఫోన్ 7, 7 ప్లస్ ఫోన్లలో బయటకు కనిపించే పెద్ద మార్పులేమీ లేనప్పటికీ... అంతర్గతంగా మాత్రం యాపిల్ కీలక మార్పులే చేస్తోంది. ఇప్పటిదాకా విడుదలైన ఐఫోన్లు 16 జీబీ మెమరీ నుంచి 128 జీబీ మెమరీ సామర్థ్యం ఉండేది. తాజా మోడల్ లో 16, 64 జీబీ మెమరీలకు స్వస్తి చెప్పేసిన యాపిల్... కొత్తగా 258 జీబీ మెమరీ సామర్థ్యాన్ని యాడ్ చేసేసింది. ఇక రంగుల విషయంలోనూ యాపిల్ సరికొత్త కసరత్తు చేసింది. తాజా మోడల్ లో ‘డార్క్ బ్లాక్’, ‘గ్లాస్సీ పియానో బ్లాక్’ రంగులను యాడ్ చేసింది. ఇక తాజా మోడల్ ఫోన్లను యాపిల్ వాటర్ ప్రూఫ్ గానూ రూపొందించింది. యాపిల్ నుంచి రేపు అఫీషియల్ గా మార్కెట్లోకి రానున్న ఐఫోన్ 7, 7 ప్లస్ ఫోన్లు... అమెరికాలో ఈ నెల 16 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇక భారత మార్కెట్ లోకి ఈ ఫోన్ల ఎంట్రీకి సంబంధించి ఇంకా తేదీలు ఖరారు కాలేదు.

  • Loading...

More Telugu News