: 6 అంగుళాల డిస్ ప్లే, 4,100 ఎంఏహెచ్ బ్యాటరీతో 'ఎం3 మ్యాక్స్'


అత్యాధునిక ఫీచర్లతో మరో ఆకర్షణీయమైన ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. లో టెంపరేచర్ పాలీ సిలికాన్ ఫుల్ హెచ్డీ 6 అంగుళాల డిస్ ప్లేతో, 30 నిమిషాల్లో 45 శాతం బ్యాటరీ చార్జ్ అయ్యే లా ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో 'ఎం3 మ్యాక్స్' పేరిట మైజూ తన నూతన ఫోన్ ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ లో 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం విశేషం. 64 బిట్ చిప్, 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 13/5 ఎంపీ కెమెరాలు తదితర సదుపాయాలున్న ఫోన్ గ్రే, సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లూ కలర్స్ లో లభిస్తుంది. దీని ధర 255 డాలర్లని (సుమారు రూ. 17 వేలు) మైజూ పేర్కొంది.

  • Loading...

More Telugu News