: విశాఖలో రియల్టర్ అక్రమ దందా!... దువ్వాడ పీఎస్ లో కేసు నమోదు!


రియల్టర్ ముసుగులో రైతులను నట్టేట ముంచిన ఓ వ్యక్తి బండారం బయటపడింది. విశాఖపట్నంలో కేఎన్ఆర్ రియల్ ఎస్టేట్స్ పేరిట కార్యకలాపాలు సాగిస్తున్న వ్యక్తి నడిపూర్ లోని మెడ్ టెక్ పార్కు స్థలంలోని రైతుల భూములను కారు చౌకగా కొట్టేశాడు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో నేటి ఉదయం పోలీసులు కేఎన్ఆర్ సంస్థ యజమాని ఇంటిపై దాడులు చేశారు. ఈ సోదాల సందర్భంగా అతడి ఇంటిలో పలు కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మెడ్ టెక్ ఏర్పాటు కానున్న ప్రాంతంలోని భూములన్నీ కేఎన్ఆర్ పేరిటే ఉన్నట్లు ఆధారాలు దొరకడంతో అతడిపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నయా దందాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News