: పోలవరంపై మీ వైఖరేమిటి?... కేంద్రానికి గ్రీన్ ట్రైబ్యూనల్ సూటి ప్రశ్న!
నవ్యాంద్రలో కీలక ప్రాజెక్టుగా ఉన్న జాతీయ ప్రాజెక్టు పోలవరంపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ కొద్దిసేపటి క్రితం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టుపై మీ వైఖరేమిటో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ట్రైబ్యూనల్ నిలదీసింది. ఏటా పోలవరం ప్రాజెక్టు పనులపై స్టార్ వర్క్ ఆర్డర్స్ ఎందుకు పొడిగిస్తున్నారని ప్రశ్నించింది. అసలు ప్రాజెక్టుపై మీ వైఖరేమిటో చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుకు కేంద్రం జారీ చేసిన పర్యావరణ అనుమతులపైనా ట్రైబ్యూనల్ ప్రశ్నాస్త్రాలు సంధించింది. రెండు వారాల్లోగా సమగ్ర వివరాలతో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.