: ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన నేపథ్యంలో... హర్యానా సింగర్ ఆత్మహత్యాయత్నం
హర్యానాకు చెందిన పాప్ సింగర్ ఎలుకల మందుతిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నైరుతి ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... హర్యానాకు చెందిన సప్నా చౌదరి ఫోక్ సింగర్. పాటలు రాసి పాడుతుంటుంది. ఫిబ్రవరిలో ఆమె రాసిన పాటలు పాడింది. ఈ పాటల్లో కొన్ని పంక్తులు దళితులను కించపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ సప్తల్ కున్వర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అంతటితో ఆగని సప్తల్ ఆమెపై దుష్ప్రచారం ప్రారంభించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.