: ఇబ్రహీంపట్నంలో కూర్చున్న మంచిరెడ్డి!... దమ్ముంటే చర్చకు రావాలని మల్ రెడ్డికి సవాల్!


హైదరాబాదు శివారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం అక్కడకు చేరుకుని రోడ్డుపైనే బైఠాయించారు. భారీ అనుచరగణంతో తరలివచ్చిన మంచిరెడ్డి... తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని మలక్ పేట మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి సవాల్ విసిరారు. గ్యాంగ్ స్టర్ నయీమ్ తో మంచిరెడ్డికి సంబంధాలున్నాయన్న మల్ రెడ్డి ఆరోపణలతో నిన్నటి నుంచి ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మల్ రెడ్డికి దమ్మూ ధైర్యం ఉంటే తనకు నయీమ్ తో సంబంధాలున్నట్లు ఆధారాలు తీసుకుని రావాలని మంచిరెడ్డి సవాల్ చేశారు.

  • Loading...

More Telugu News