: ప్రారంభమైన రిలయన్స్ ‘జియో’ సేవలు .. వినియోగదారులకు పండగే పండగ!
ఎప్పుడెప్పుడా అని మొబైల్ వినియోగదారులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రిలయన్స్ జియో సర్వీసులు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు రిలయన్స్ వినియోగదారులు జియో సేవలను ఉచితంగా పొందనున్నారు. ఇందుకోసం 2 లక్షల స్టోర్లలో జియో సిమ్‌కార్డులను సంస్థ విక్రయించింది. దాదాపు 10 కోట్ల మంది వినియోగదారులు లక్ష్యంగా రిలయన్స్ ప్రకటించిన ఈ భారీ ఆఫర్‌కు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించిన సంగతి తెలిసిందే. సిమ్‌లను చేజిక్కించుకునేందుకు యువతీయువకులు పోటీపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో అయితే వీటిని బ్లాకుల్లో కూడా విక్రయించారు. ఇక రిలయన్స్ ఆఫర్‌తో బెంబేలెత్తిన ఇతర నెట్‌వర్క్‌లు డేటా ప్యాక్‌లను భారీగా తగ్గించిన విషయం తెలిసిందే.