: రాజకీయాల్లోకి ‘కబాలి’?.. రజనీ అరంగేట్రంపై తమిళనాట మళ్లీ మొదలైన ఊహాగానాలు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై తమిళనాడులో మళ్లీ చర్చమొదలైంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందని ఆయన అభిమానులు చెబుతున్నారు. అబ్దుల్ కలాం విజన్ ఇండియా పార్టీ (అబ్దుల్ కలాం వీఐపీ) వ్యవస్థాపకుడు పొన్‌రాజ్‌తో రజనీకాంత్ భేటీ కావడాన్ని ఇందుకు కారణంగా చెబుతున్నారు. వీరిద్దరి కలయిక నేపథ్యంలో రజనీ రాజకీయ రంగప్రవేశంపై తమిళనాట మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. రజనీ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని భేటీలో పొన్‌రాజ్ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ‘దేవుడు అదే నిర్ణయిస్తే తప్పకుండా అలాగే జరిగి తీరుతుంది’ అని ‘కబాలి’ వ్యాఖ్యానించినట్టు సమాచారం. ప్రస్తుతం ఎందిరన్-2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న రజనీ.. పొన్‌రాజన్‌ను కలిసి రాజకీయ చర్చకు తెరతీశారు. కాగా గతంలో రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చినా ఆయన ఎప్పుడూ ఈ విషయంపై స్పందించలేదు. మరి ఇప్పుడేమంటారో వేచి చూడాల్సిందే.