: హెయిర్ సెట్ చేయడంలో రాజ్ తరుణ్ స్పెషలిస్టు!: కథానాయిక అను ఇమ్మాన్యుయెల్


హీరో నాని గురించి అతనితో నటించే హీరోయిన్లంతా ఆయన మంచి కోస్టార్ అనే చెబుతుంటారని 'మజ్ను' సినిమాలో ఆయనతో కలిసి నటించిన అను ఇమ్మాన్యుయెల్ తెలిపింది. నాని చాలా సహకరించాడని చెప్పింది. నానితో మళ్లీ మళ్లీ నటించాలని కోరుకుంటున్నానని, తన కోరిక త్వరలోనే నెరవేరుతుందని అను ఆకాంక్షించింది. సినిమాలో అవకాశం కల్పించిన దర్శకుడు విరించి వర్మ, నిర్మాత గీత గొల్లకి ధన్యవాదాలు తెలిపింది. తనను మరింత అందంగా చూపించిన డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీకి ధన్యవాదాలు తెలిపింది. ఈ సినిమాకు మంచి పాటలు అందించిన మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కు శుభాకాంక్షలు తెలిపింది. 'మజ్ను' సినిమా సెట్ కు విరించి వర్మను కలుసుకునేందుకు నటుడు రాజ్ తరుణ్ వచ్చేవాడని చెప్పింది. మూవీ మేకింగ్ వీడియోలో రాజ్ తరుణ్ తన హెయిర్ సరి చేస్తూ కనిపిస్తాడని, హెయిర్ సెట్ చేయడంలో రాజ్ తరుణ్ స్పెషలిస్టని అను చెప్పింది.

  • Loading...

More Telugu News