: బక్రీద్ సందర్భంగా జరిగే గోవధను అడ్డుకోండి : వీహెచ్పీ పిలుపు
బక్రీద్ సందర్భంగా జరిగే గోవధను అడ్డుకోవాలని విశ్వహిందూ పరిషత్ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విశ్వహిందూపరిషత్ కు చెందిన తెలంగాణా విభాగం నేతలు ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో ఈనెల 12న దేశవ్యాప్తంగా జరగనున్న బక్రీద్ పండగను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే గో హత్యలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. బక్రీద్ ను పురస్కరించుకుని అనేక మసీదులు, మదర్సాలు, ఇతర రహస్య ప్రదేశాల్లో బంధించి ఉంచిన ఆవులను కాపాడాలని వీహెచ్పీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఆవులు, లేగదూడల వధ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వానికి సూచించారు. దీనిపై గవర్నర్, ముఖ్యమంత్రి స్పందించాలని, రాష్ట్రంలో గోవధ జరగకుండా చూడాలని వారు కోరారు.