: తూర్పు పాకిస్థాన్‌లా బెలూచిస్థాన్.. వేర్పాటువాదులకు భారత్ ఊతమిస్తోందన్న పాక్ మాజీ మంత్రి


బెలూచిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితి ఒకప్పటి తూర్పు పాకిస్థాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లా ఉందని పాకిస్థాన్ మాజీ మంత్రి రెహ్మాన్ మాలిక్ అన్నారు. అక్కడి వేర్పాటువాదులకు భారత్ అండదండలు అందిస్తోందని ఆయన ఆరోపించారు. 2008-13 మధ్య అసిఫ్ అలీ జర్దారీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన భారత్‌పై ఆరోపణలు గుప్పించారు. ‘‘బెలూచిస్థాన్‌లో తూర్పు పాకిస్థాన్ లాంటి వాతావరణాన్ని సృష్టించారు. ఆందోళనకారులకు భారత్, బంగ్లాదేశ్ నుంచి సాయం అందుతోంది’’ అని ఆరోపించారు. బెలూచిస్థాన్ ఆందోళనల వెనక భారత్ ఉందన్న సంగతి బహిరంగ రహస్యమేనన్నారు. అప్పట్లోనే ఈ విషయాన్ని భారత మంత్రి పి.చిదంబరం దృష్టి తీసుకెళ్లామని, అయితే తమ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయాక ఈ విషయం అక్కడితో ఆగిపోయిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News