: కర్ణాటకలో నేడు ప్రధాని ఎన్నికల ప్రచారం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకుంది. వివిధ పార్టీల నేతలు ప్రచారంలో తలమునకలవుతున్నారు. ఇప్పుడు ప్రధాని కూడా అందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ తరఫున ఈరోజు మన్మోహన్ ప్రచారం చేస్తారు. అటు ఎన్నికలకు వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ప్రధాని నేడు ముందుగా హుబ్లీ పట్టణంలో బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం బెంగళూరు గ్రామీణ ప్రాంతంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.