: ‘ప్యాకేజీ’లోనే ‘హోదా’!... కొత్త వాదన వినిపించిన పురందేశ్వరి!


ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై బీజేపీ కొత్త వాదనను వినిపించింది. విజయవాడలో నేటి ఉదయం ప్రారంభమైన బీజేపీ పదాధికారుల సమావేశానికి హాజరైన ఆ పార్టీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఈ వాదనను వినిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కొన్ని ఇబ్బందులున్నాయని పేర్కొన్న ఆమె... సాంకేతికంగా ప్రత్యేక హోదాను ప్రస్తావించలేమని ప్రకటించారు. ప్రత్యేక ప్యాకేజీ పేరిట అందజేయనున్న సాయంలో ప్రత్యేక హోదా ద్వారా లభించే అంశాన్నింటినీ అందులో పొందుపరుస్తామని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News