: తెలంగాణ కోసం డీకే అరుణ ఎలాంటి ఉద్యమాలూ చేయలేదు, ఇప్పుడు చేస్తోన్న దీక్ష ఓ డ్రామా: మంత్రి జూపల్లి


తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తోన్న కొత్త జిల్లాల ఏర్పాటు నేప‌థ్యంలో గద్వాల, జ‌న‌గామ ప్రాంతాల‌ను జిల్లాలుగా చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయ‌కురాలు డీకే అరుణ హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్ వ‌ద్ద నిరాహార దీక్ష‌కు దిగ‌డం ప‌ట్ల తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆమె దీక్ష ఓ డ్రామా అని ఆయ‌న వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం డీకే అరుణ ఎటువంటి ఉద్యమాల్లోనూ పాల్గొన‌లేద‌ని విమ‌ర్శించారు. అయితే, స్థానికులు గద్వాలను జిల్లా చేయాలని కోరుకోవడంలో తప్పు లేదని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తమ ప్ర‌భుత్వం రాజకీయ ప్ర‌యోజ‌నాల కోసం కొత్త జిల్లాల ఏర్పాటు చేయ‌డం లేద‌ని, స‌మ‌ర్థ‌వంత‌మైన పాల‌న‌ను ప్ర‌జ‌లకు అందించాల‌నే ఉద్దేశంతోనే చేస్తోంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌తిప‌క్షాలు వాటిపై రాజ‌కీయాలు చేయొద్ద‌ని సూచించారు.

  • Loading...

More Telugu News