: కడప జిల్లాలో వైఎస్ జగన్ మహాధర్నా.. భారీగా చేరుకున్న రైతులు


రాయలసీమ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించకపోవడంపై నిరసన తెలుపుతూ ఈరోజు కడప జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ద్ద‌ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో రైతులు మహాధర్నాకు దిగారు. ధ‌ర్నాకు సీపీఐ, సీపీఎం పార్టీల‌తో పాటు పలు ప్రజాసంఘాలు మ‌ద్ద‌తు తెలిపాయి. రాయ‌ల‌సీమ ఆయ‌క‌ట్టుకు నీళ్లు అందించాల్సిందేన‌ని రైతులు, వైసీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ధ‌ర్నాస్థ‌లికి భారీ ఎత్తున ప్ర‌జ‌లు చేరుకున్నారు. రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల‌కు నీరు క‌ర‌వైపోతోంద‌ని వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ధ‌ర్నా అనంత‌రం రైతులనుద్దేశించి జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు.

  • Loading...

More Telugu News