: హాస్య నటుడు అలీ సరదా మాటలకు నవ్వులే నవ్వులు


‘సిద్ధార్థ’ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న హాస్యనటుడు అలీ నవ్వులు పూయించాడు. ‘అందరి హీరోలకు మాటలు రాసిన పరుచూరి బ్రదర్స్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు మాటలు రాయలేదు. ఆ అవకాశం వారికి నేను కల్పిస్తాను.. పవన్ కల్యాణ్ కు నేను చెబుతాను’ అని అలీ అనడంతో ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల నుంచి ప్రతిఒక్కరూ విరగబడి నవ్వారు. ముఖ్యంగా, మాటల రచయిత పరచూరి గోపాలకృష్ణ తలకాయ ఊపుతూ మరీ, నవ్వులు చిందించారు. అంతేకాకుండా, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా నవ్వులు చిందించాడు.

  • Loading...

More Telugu News