: రేపు కడపలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ధర్నా


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు కడపలో ధర్నా చేపట్టనున్నారు. రాయలసీమకు సాగు నీటి సరఫరా విషయంలో ప్రభుత్వం విఫలమైందంటూ జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు ధర్నా ప్రారంభిస్తామని, మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించి ధర్నా విరమిస్తామని తెలిపారు. ఈ ధర్నాతో అయినా ప్రభుత్వం దిగొచ్చి రైతు సమస్యలను పరిష్కరిస్తుందని, రాయలసీమ నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. కాగా, రేపు ధర్నా చేపట్టనున్న ప్రాంతాన్ని కడప, కమలాపురం ఎమ్మెల్యేలు ఈరోజు పరిశీలించారు.

  • Loading...

More Telugu News