: తుని విధ్వంసం కేసులో భూమన, 'నంబర్ 1' న్యూస్ ఛానల్ అధినేత సుధాకర్ నాయుడులకు సీఐడీ నోటీసులు
తునిలో కాపు గర్జన సందర్భంగా జరిగిన రైలు దహనం, పోలీసు స్టేషన్లలో విధ్వంసకాండ కేసుల్లో వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది. భూమనతో పాటు 'నంబర్ 1' న్యూస్ ఛానల్ అధినేత సుధాకర్ నాయుడు సహా మొత్తం 20 మందిని విచారణకు పిలిచింది. సెప్టెంబర్ 4న గుంటూరు, రాజమహేంద్రవరంలోని సీఐడీ కార్యాలయాల్లో విచారణకు రావాలని ఈ నోటీసుల్లో ఆదేశించింది. పది మందిని గుంటూరుకు, మరో పది మందిని రాజమహేంద్రవరానికి రావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వారి నుంచి విచారణలో రాబట్టిన వివరాల ఆధారంగా వీరికి నోటీసులు జారీ అయినట్టు సీఐడీ వర్గాలు వెల్లడించాయి.