: నవంబర్, డిసెంబర్ నెలలకు 1.05 లక్షల శ్రీవారి సేవా టికెట్లు అందుబాటులో... బుకింగ్స్ ప్రారంభం


నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి తిరుమల వెంకటేశ్వరునికి వివిధ రకాల సేవలకు సంబంధించిన 1.05 లక్షల టికెట్లను అందుబాటులో ఉంచినట్టు టీటీడీ ఈఓ సాంబశివరావు వెల్లడించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన అక్టోబర్ 3 నుంచి 11 వరకూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నామని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, గరుడోత్సవం రోజున 24 గంటలూ కనుమదారులు తెరచే ఉంచుతామని వెల్లడించారు. కాగా, టికెట్ల బుకింగ్ ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సేవా టికెట్లను బుక్ చేసుకునేందుకు భక్తులు పెద్దఎత్తున ప్రయత్నిస్తుండటంతో, టీటీడీ సైట్ తెరచుకునేందుకు మొరాయిస్తోంది.

  • Loading...

More Telugu News