: నిరుద్యోగులకు శుభవార్త... తెలంగాణ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త... టీఎస్ పీఎస్సీ నిర్వహించనున్న గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్-2 ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1032 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. రేపటి నుంచి ఈ నెల 23 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో దరఖాస్తు చేసిన వారు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, చేసుకున్నా నష్టం లేదని టీఎస్ పీఎస్సీ తెలిపింది. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.