: ఏపీకి కనీసం ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతున్నాం: సుజనా చౌదరి
ఏపీకి కనీసం ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దని చెబుతున్నామన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించారని, అదనపు సాయం చేయమని పదేపదే కోరుతున్నామని, మిత్రపక్షం బీజేపీతో కలిసి పోరాడుతున్నామని చెప్పారు. అందరినీ సంప్రదించి లాభానష్టాలపై తర్జనభర్జనలు జరుగుతున్నాయని, రాజధాని అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నారని, వెనుకబడిన 7 జిల్లాలకు ఆరేళ్లపాటు రూ.350 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సుజనా పేర్కొన్నారు.