: ఓటుకు నోటు వ్యవహారంలో గవర్నర్ ను కూడా మార్చే ప్రయత్నం జరుగుతోంది: రఘువీరారెడ్డి
ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నీరుగార్చేందుకు యత్నిస్తున్నాయని, గవర్నర్ ను కూడా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో విచారణ నుంచి తనను మినహాయించాలంటూ స్టే కోసం వెళ్లడమంటే.. తప్పు చేశానన్నదానికి అర్థాంగీకారమని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో హక్కులకు భంగం కలిగితే ఊరుకోమని, ప్రత్యేక హోదాతో పాటు చట్టంలో పొందుపరిచినవన్నీ అమలు చేయాలని, ఏపీ ప్రజలను కేంద్రం మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రత్యేక హోదా చట్టంలో లేదని చెప్పి, కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.